కుక్క కరిచినా వెనక్కి తగ్గకుండా కన్నతల్లి ప్రాణాల కోసం పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తిన ఐదేళ్ల చిన్నారి

కుక్క కరిచినా వెనక్కి తగ్గకుండా కన్నతల్లి ప్రాణాల కోసం పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తిన ఐదేళ్ల చిన్నారి

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయీలో ఆస్తి వివాదం కారణంగా ఒక మహిళపై ఆమె బంధువులు కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఆమె ఐదేళ్ల కుమార్తెపైకి పెంపుడు కుక్కను వదిలి గాయపరిచారు. కుక్క కరవడంతో ఒళ్లంతా రక్తం ఓడుతున్నా, ఆ చిన్నారి ఏమాత్రం భయపడకుండా తన తల్లిని కాపాడుకోవడం కోసం సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు ఒంటరిగా పరుగెత్తింది.

స్టేషన్‌లో ఉన్న పోలీసులకు తన తల్లి పరిస్థితిని వివరించి ఏడుస్తూ వేడుకోవడంతో వారు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని కాపాడేందుకు ఆ చిన్నారి చూపిన ధైర్యసాహసాలు చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ చిన్నారి సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *