కడుపులో అర మీటర్ బ్యాండేజీ మర్చిపోయి కుట్లు వేసిన వైద్యులు ఏడాదిన్నర నరకయాతన అనుభవించిన మహిళ

గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవ శస్త్రచికిత్స సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా మహిళ కడుపులో అర మీటర్ పొడవైన బ్యాండేజీని వదిలేశారు. దీనివల్ల గత ఏడాదిన్నర కాలంగా ఆమె తీవ్రమైన నొప్పితో నరకం అనుభవించింది. అనేక ఆసుపత్రులు తిరిగినా సమస్య బయటపడలేదు, చివరకు ఈ ఏడాది ఏప్రిల్లో మరో శస్త్రచికిత్స ద్వారా ఆ వస్త్రాన్ని తొలగించారు. సాక్ష్యంగా ఫోటోలు మరియు వీడియోలు ఉన్నాయని బాధితురాలు పేర్కొంది.
కోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ అంజనా అగర్వాల్, మనీష్ గోయల్ మరియు జిల్లా ముఖ్య ఆరోగ్య అధికారితో సహా ఆరుగురిపై నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నిర్లక్ష్యం కారణంగా సదరు మహిళ మళ్ళీ తల్లి అయ్యే అవకాశాన్ని కోల్పోయిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి బెదిరింపులు వస్తున్నట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.