ఒప్పందం కుదరకపోతే యుద్ధమేనని ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

ఒప్పందం కుదరకపోతే యుద్ధమేనని ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

ఇరాన్ అణు కార్యక్రమంపై పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పశ్చిమ ఆసియా సమీప సముద్రంలో యుద్ధనౌకలను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ వెంటనే అణు ఒప్పందానికి అంగీకరించకపోతే సైనిక చర్య తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా సైన్యం కొన్ని వారాల పాటు కొనసాగే భారీ ఆపరేషన్ కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది ప్రపంచవ్యాప్తంగా మరో పెద్ద యుద్ధం మొదలవుతుందనే ఆందోళనను పెంచుతోంది.

ఒమన్‌లో ఇరాన్ మరియు అమెరికా మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు ఎటువంటి పరిష్కారం లేకుండా ముగియడంతో ఈ అనిశ్చితి నెలకొంది. ఇరాన్ రహస్యంగా అణు ఆయుధాలను తయారు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. రెండు దేశాలు తమ పట్టుదలను వీడకపోవడంతో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితి క్లిష్టంగా మారింది. ట్రంప్ తీసుకోబోయే తదుపరి నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *