ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ చంద్రబాబు కీలక నిర్ణయం
February 23, 2026

ఏపీలో ప్రభుత్వ సేవలను మరింత వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇకపై ప్రతి నెలా ఉత్తమ ప్రతిభ కనబరిచే సిబ్బందికి ప్రత్యేక అభినందన పత్రాలతో పాటు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈ ప్రశంసలను వారి వ్యక్తిగత సర్వీస్ రికార్డుల్లో కూడా నమోదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. పనితీరు బాగున్న వారిని గుర్తించడమే కాకుండా, వెనుకబడిన వారిని మోటివేట్ చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల్లో ఆరోగ్యకరమైన పోటీ పెరిగి, ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.