ఎస్సీ ఎస్టీ సభ్యుల పట్ల ప్రతి అవమానం అత్యాచారం కాదు హైకోర్టు కీలక తీర్పు

ఎస్సీ ఎస్టీ సభ్యుల పట్ల ప్రతి అవమానం అత్యాచారం కాదు హైకోర్టు కీలక తీర్పు

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఒక వ్యక్తిని అవమానించడం లేదా వేధించడం ప్రతి సందర్భంలోనూ నేరం కాదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశంలో ఉద్దేశపూర్వకంగా కులపరంగా దూషించినప్పుడు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని జస్టిస్ చైతాలీ ఛటర్జీ దాస్ పేర్కొన్నారు. కేవలం వృత్తిపరమైన విభేదాలు లేదా పరిపాలనాపరమైన ఫిర్యాదులను అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు తేల్చిచెప్పింది.

సంస్కృత కళాశాల హెచ్‌ఓడీపై దాఖలైన కేసును కొట్టివేస్తూ, సదరు సంఘటనలు పబ్లిక్ వ్యూలో జరగలేదని ధర్మాసనం గుర్తించింది. నిందితుడికి బాధితుడి కులం ఆధారంగా అవమానించాలనే దురుద్దేశం లేనప్పుడు, ఆరోపణలు చట్టప్రకారం చెల్లవని కోర్టు వివరించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ తీర్పు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *