‘ఎన్ని ఓట్లు వచ్చాయి? పాపులారిటీ కోసమే కోర్టుకు వచ్చారా?’ ప్రశాంత్ కిషోర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
February 6, 2026

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. “ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన తర్వాత, కేవలం ప్రచారం కోసమే కోర్టుకు వచ్చారా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. ఓడిపోయిన రాజకీయ పార్టీ మొత్తం ఎన్నికల ప్రక్రియను ఇలా సవాలు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.
ప్రభుత్వ పథకాల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టారని జన్ సూరాజ్ తరపు న్యాయవాది వాదించారు. అయితే, ఉచిత పథకాలపై అభ్యంతరాలు ఉంటే పౌరులు ప్రశ్నించాలి కానీ, ఓడిపోయిన పార్టీలు కాదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న జన్ సూరాజ్ పార్టీకి, పాట్నా హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు కల్పించింది.