ఎతిహాద్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్: విమాన టికెట్లపై 30% తగ్గింపు
March 26, 2025

యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయ ప్రయాణికుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ వేసవిలో ఎతిహాద్ విమానాల్లో ప్రయాణించే భారతీయులకు 30% డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ ప్రత్యేక తగ్గింపు ఫ్రాన్స్, టర్కీ, స్పెయిన్, ప్రాగ్, గ్రీస్, వార్సా రూట్లకు వర్తిస్తుంది.
ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలనుకునేవారు మార్చి 28లోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చు. భారతీయ ప్రయాణికుల కోసం భారీ తగ్గింపు అందించడంతో ఎతిహాద్ ఆఫర్‌పై మంచి స్పందన రావొచ్చని అంచనా వేస్తున్నారు.