ఎంపురాన్ కోసం భారీ త్యాగం – రెమ్యునరేషన్ లేకుండానే పని చేసిన హీరో, దర్శకుడు

ఎంపురాన్ కోసం భారీ త్యాగం – రెమ్యునరేషన్ లేకుండానే పని చేసిన హీరో, దర్శకుడు

మలయాళ సినీ పరిశ్రమలో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న చిత్రం ‘L2: ఎంపురాన్’. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక విషయం తాజాగా బయటకు వచ్చింది.

దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ చిత్రానికి తానూ, మోహన్ లాల్ కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. సినిమా నిర్మాణ వ్యయాన్ని పెంచకుండా, మూవీ క్వాలిటీ కోసం తమ పారితోషికాన్ని వినియోగించారని ఆయన తెలిపారు. చిన్న పరిశ్రమగా భావించే మలయాళ సినీ రంగం, ప్రస్తుత పరిస్థితుల్లో టాప్ టియర్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాలను రూపొందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం మలయాళ చిత్రసీమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *