ఎంపీల జీతాలు, భత్యాల్లో పెరుగుదల – కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ఎంపీల జీతాలు, పెన్షన్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో పార్లమెంట్ సభ్యులకు నెలకు రూ.1.24 లక్షలు జీతంగా లభిస్తాయి, ఇది గతంలో రూ.1 లక్ష మాత్రమే. అంతేకాకుండా, రోజువారీ భత్యాన్ని రూ.2 వేల నుంచి రూ.2,500కి పెంచారు. అలాగే, మాజీ ఎంపీల పెన్షన్ కూడా రూ.25 వేల నుంచి రూ.31 వేలుగా పెంచారు. ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి రానున్నాయి.
ఈ నిర్ణయం 2018లో అమలు చేసిన నియమాల ప్రకారం తీసుకున్నారు. ఎంపీల జీతాలు, భత్యాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సమీక్షించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు రూ.70,000 నియోజకవర్గ భత్యంగా అందుకుంటారు. అదనంగా, పార్లమెంటు సమావేశాల సమయంలో నెలకు రూ.60,000 ఆఫీస్ అలవెన్స్, రోజుకు రూ.2,000 డైలీ అలవెన్స్ అందిస్తారు. ఈ భత్యాల్లో కూడా మార్పులు చేశారు.