ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కామెంట్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. విడుదలైన కొద్ది సేపట్లోనే ఈ ట్రైలర్ రికార్డు వ్యూస్ సాధిస్తూ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

ఈ ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన స్పందిస్తూ.. “మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్‌తో అన్నీ శుభాలే జరుగుతాయి” అంటూ ట్వీట్ చేశారు. తన సినిమా ట్రైలర్ పై మెగాస్టార్ సానుకూలంగా స్పందించడం పట్ల దర్శకుడు హరీష్ శంకర్ ఆనందం వ్యక్తం చేస్తూ చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మెగాస్టార్ ఇచ్చిన ఈ బూస్టప్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ మరియు హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *