ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ పాత మ్యాజిక్ రిపీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఖరారైంది. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమాలో అభిమానులకు ఒక భారీ సర్ ప్రైజ్ ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘తొలిప్రేమ’ చిత్రంలోని ఎవర్ గ్రీన్ సాంగ్ ‘ఈ మనసే’ను ఈ సినిమాలో రీక్రియేట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
అప్పట్లో లవర్ బాయ్‌గా పవన్ కళ్యాణ్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆయన మాస్ ఇమేజ్‌తో పాటు, మళ్ళీ ఆనాటి లవర్ బాయ్ ఛామ్ ఎలా ఉంటుందోనని అభిమానులు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఈ పాట రీమిక్స్ వర్షన్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తోంది. అలాగే పార్తీబన్, గౌతమి, కేఎస్ రవికుమార్ వంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉగాది పండుగ నాడు పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.