ఉల్లి, వెల్లుల్లి రహస్యం: ఈ కూరగాయలను ఎందుకు మాంసాహారంగా భావిస్తారు?
September 20, 2025

పురాణాల ప్రకారం, ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని మాంసాహారంతో సమానంగా పరిగణిస్తారు. సముద్ర మథనం సమయంలో, విష్ణువు మోహిని రూపంలో దేవతలకు అమృతాన్ని పంచుతుండగా, రాహువు మరియు కేతువు అనే ఇద్దరు రాక్షసులు దేవతల రూపంలో వచ్చి అమృతం సేవించారు. విష్ణువు వారిని గుర్తించి తన సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండించారు.
ఆ సమయంలో అమృతం వారి గొంతులోంచి భూమిపై పడటంతో, ఆ చుక్కల నుంచి ఉల్లిపాయ, వెల్లుల్లి పుట్టినట్లు నమ్మకం. అందుకే, వీటిని తినడం వల్ల శరీరంలో రాక్షస గుణాలు పెరుగుతాయని భావిస్తారు. ఈ కారణం చేతనే, అనేకమంది మతపరమైన ఆచారాల సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని తినడం మానుకుంటారు.