ఉద్యోగులకు తీపి కబురు.. రూ.6,200 కోట్ల బకాయిల విడుదల

ఉద్యోగులకు తీపి కబురు.. రూ.6,200 కోట్ల బకాయిల విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిధుల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని, సోమవారం ఉదయం నుంచి ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో ఉద్యోగుల GLI (గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్), GPF (జనరల్ ప్రావిడెంట్ ఫండ్) బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.6,200 కోట్లు విడుదల చేసింది. బుధవారం నాటికి అన్ని ఖాతాల్లో పూర్తిస్థాయిలో నగదు జమ అవుతుందని ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఉద్యోగుల విశ్వాసం పెరిగిందని ఎన్జీవో సంఘం నేతలు తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరిచిందని, అందుకే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరిలో కూడా ప్రభుత్వం రూ.1,033 కోట్ల బకాయిలను విడుదల చేసిన విషయం గుర్తుచేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాదు, ఉద్యోగులకు ప్రమోషన్లు, ముందస్తు జీతాల కోసం కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *