ఇరవై ఏళ్లుగా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్న రాజస్థాన్ మహిళ పులి కళ్ల రహస్యం

ఇరవై ఏళ్లుగా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్న రాజస్థాన్ మహిళ పులి కళ్ల రహస్యం

పుష్కర్ మేళా వీధుల్లో రెండు దశాబ్దాల క్రితం ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించిన పప్పు దేవి కళ్ల ఫోటో నేటికీ ప్రపంచవ్యాప్తంగా సంచలనమే. పులి కళ్లను పోలి ఉండే ఆమె తీక్షణమైన చూపులు రాజస్థాన్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాయి. ప్రస్తుతం ఆమె పుష్కర్‌లో చిన్న దుకాణం నడుపుతున్నారు.

పప్పు దేవికి ముగ్గురు కుమార్తెలు కాగా వారిలో ఇద్దరికి తల్లిలాగే అరుదైన కళ్లు వారసత్వంగా రావడం విశేషం. పర్యాటకులు అవి లెన్స్‌లు అని భ్రమపడినా అవి సహజమైనవేనని ఆమె స్పష్టం చేశారు. కేవలం పర్యాటకుల కోరిక మేరకే తాము బంజారా సంప్రదాయ దుస్తులు ధరిస్తామని ఆమె వివరించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *