ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన అభిషేక్ శర్మ, నమీబియాతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ ఆడతారా

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన అభిషేక్ శర్మ, నమీబియాతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ ఆడతారా

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఫిట్‌నెస్ సమస్యలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అనారోగ్యం బారిన పడిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నమీబియాతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆయన ఆసుపత్రిలో చేరడం జట్టులో ఆందోళన కలిగించింది. ప్రాక్టీస్ సెషన్‌కు కూడా దూరం కావడంతో, తదుపరి మ్యాచ్‌లో అభిషేక్ ఆడతారా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం, అభిషేక్ శర్మ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. విలేకరుల సమావేశంలో తిలక్ వర్మ మాట్లాడుతూ, అభిషేక్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అభిషేక్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే, మేనేజ్‌మెంట్ సంజూ శామ్సన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు ఇషాన్ కిషన్‌తో కలిసి శామ్సన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. భారత అభిమానులు ఇప్పుడు అభిషేక్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాలని కోరుకుంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *