ఆర్జీ కర్ అవినీతి కేసు: మెయిన్ విలన్ సందీప్ ఘోష్.. ఈడీ తొలి ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు!

ఆర్జీ కర్ అవినీతి కేసు: మెయిన్ విలన్ సందీప్ ఘోష్.. ఈడీ తొలి ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు!

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం కీలక అడుగు వేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కోర్టులో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇతనితో పాటు వ్యాపారవేత్తలు బిప్లబ్ సింగ్, సుమన్ హజ్రా పేర్లను కూడా ఈడీ చేర్చింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టి భారీగా నిధులు దారిమళ్లించినట్లు దర్యాప్తు సంస్థ నిర్ధారించింది.

గతంలోనే సిబిఐ అరెస్ట్ చేసిన సందీప్ ఘోష్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసి ఈ ఛార్జిషీట్ సమర్పించింది. ఆసుపత్రి పరికరాల సరఫరాలో జరిగిన అక్రమాలపై పక్కా ఆధారాలను ఈడీ సేకరించింది. ఈ పరిణామంతో సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *