ఆర్కిటెక్చర్ నుంచి యాక్టింగ్ వైపు కళ్యాణి ప్రియదర్శన్ నాగార్జున ఒక్క ఫోన్ కాల్‌తో మారిన తలరాత

ఆర్కిటెక్చర్ నుంచి యాక్టింగ్ వైపు కళ్యాణి ప్రియదర్శన్ నాగార్జున ఒక్క ఫోన్ కాల్‌తో మారిన తలరాత

మలయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ తన కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ సినీ రంగ ప్రవేశం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కళ్యాణి అసలు నటి అవుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఆమె ఆర్కిటెక్చర్ చదివిందని, అదే రంగంలో స్థిరపడాలని భావించిందని ఆయన తెలిపారు. నటనపై ఆమెకు మొదట్లో కనీస ఆసక్తి కూడా లేదని ఈ సందర్భంగా ప్రియదర్శన్ గుర్తు చేసుకున్నారు.

అయితే అక్కినేని నాగార్జున చేసిన ఒక ఫోన్ కాల్ కళ్యాణి జీవితాన్ని మలుపు తిప్పింది. తన సినిమాలో హీరోయిన్‌గా కళ్యాణిని తీసుకోవాలని నాగార్జున కోరగా, ఆమెకు నటన రాదని ప్రియదర్శన్ వారించినా ఆయన వినలేదు. చివరకు కళ్యాణి కూడా ఒక ప్రయత్నం చేసి చూస్తానని, వర్కవుట్ కాకపోతే మళ్లీ తన ఆర్కిటెక్చర్ వృత్తిలోకి వెళ్ళిపోతానని చెప్పి వెండితెరకు పరిచయమైంది. నేడు ఆమె సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఎదగడం పట్ల తండ్రిగా తాను ఎంతో గర్వపడుతున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, ఇంట్లో మాత్రం తాము సినిమాల గురించి చర్చించుకోమని ప్రియదర్శన్ స్పష్టం చేశారు. కళ్యాణి తన ప్రాజెక్టుల విషయంలో తండ్రి సలహాలు తీసుకోదని, అలాగే తాను కూడా ఆమె పనిలో జోక్యం చేసుకోనని ఆయన వివరించారు. ప్రస్తుతం కళ్యాణి ‘లోకా: చాప్టర్ 1’ సీక్వెల్‌లో నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టోవినో థామస్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రియదర్శన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *