ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైమానిక దాడుల విధ్వంసం ఎనభై మంది మృతి
February 24, 2026

ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్హర్, పక్తికా మరియు ఖోస్ట్ ప్రావిన్సులపై పాకిస్థాన్ సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. నిషేధిత టీటీపీ మరియు దానేష్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా జరిగిన ఈ వైమానిక దాడుల్లో సుమారు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని బన్నూ, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు ప్రతీకారంగానే ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
దోహా ఒప్పందానికి విరుద్ధంగా ఆఫ్ఘన్ భూభాగం నుండి ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఈ దాడుల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని అంతర్గత వ్యవహారాల మంత్రి తా లాల్ చౌదరి ధృవీకరించారు. అయితే, తమ దేశంలో ఉగ్రవాద స్థావరాలు లేవని, పాక్ తన వైఫల్యాలను ఇతరులపై నెడుతోందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది.