ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు, జూలై 23న రిటైర్మెంట్

వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారు. జూలై 23న జమైకాలోని సబీనా పార్క్‌లో తన సొంత మైదానంలో సిరీస్‌లోని రెండవ టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారు. అయితే, ఈ స్టార్ ప్లేయర్ ఫ్రాంచైజీ క్రికెట్‌ను కొనసాగిస్తారు.
టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి కేవలం ఏడు నెలల ముందు రస్సెల్ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కీలకం. నికోలస్ పూరన్ కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 2012 మరియు 2016 టీ20 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న వెస్టిండీస్ జట్లలో 37 ఏళ్ల రస్సెల్ కీలక సభ్యుడు. అతను తన దేశం తరపున 84 టీ20 మ్యాచ్‌లలో 1078 పరుగులు చేసి 61 వికెట్లు పడగొట్టాడు.