అర్జున్‌ను ప్రపంచస్థాయి బ్యాటర్‌గా మార్చుతా: యోగ్‌రాజ్

అర్జున్‌ను ప్రపంచస్థాయి బ్యాటర్‌గా మార్చుతా: యోగ్‌రాజ్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను ప్రపంచస్థాయి బ్యాటర్‌గా తీర్చిదిద్దుతానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అంటున్నారు. అర్జున్ తన ప్రతిభను బౌలింగ్‌పై వ్యర్థం చేసుకుంటున్నాడని, అతడిలో అసలు టాలెంట్ బ్యాటింగ్‌లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాను శిక్షణ ఇచ్చితే అర్జున్ అత్యుత్తమ బ్యాటర్‌గా మారతాడని ధీమా వ్యక్తం చేశారు.

“అర్జున్ 12 రోజులు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత రంజీ ట్రోఫీలో సెంచరీ చేశాడు. కానీ అది ఎవరికీ గుర్తుండలేదా? అతడు మరింత శ్రమిస్తే ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా ఎదగగలడు. ఆరు నెలల్లోనే అతడిని బెస్ట్ బ్యాటర్‌గా మార్చగలను,” అని యోగ్‌రాజ్ తెలిపారు. అర్జున్ బ్యాటింగ్‌ను మెరుగుపరిచేలా సరైన దిశలో శిక్షణ ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *