అమెరికా మరియు రష్యా రహస్య ఒప్పందం కారణంగా బంగారం మరియు వెండి ధరల్లో భారీ పతనం

అమెరికా మరియు రష్యా రహస్య ఒప్పందం కారణంగా బంగారం మరియు వెండి ధరల్లో భారీ పతనం

అమెరికా మరియు రష్యా మధ్య కుదురనున్న రహస్య ఆర్థిక ఒప్పంద వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. డాలర్ సెటిల్‌మెంట్ వ్యవస్థను పునరుద్ధరించే దిశగా పుతిన్ మరియు ట్రంప్ అడుగులు వేస్తుండటంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 4 శాతం, వెండి ధర 8 శాతానికి పైగా పడిపోయింది. దీని ప్రభావంతో దేశీయంగా ఒకే రోజు వెండి ధర రూ. 26 వేలు, బంగారం ధర రూ. 6 వేల వరకు తగ్గడం గమనార్హం.

ముడి చమురు, సహజ వాయువు వంటి ఏడు కీలక రంగాలలో ఇరు దేశాలు భాగస్వాములుగా మారే అవకాశం ఉంది. 2022 నాటి స్విఫ్ట్ నిషేధాన్ని పక్కన పెట్టి డాలర్లలో లావాదేవీలు ప్రారంభిస్తే అమెరికా కరెన్సీ మరింత బలపడుతుంది. ఈ పరిణామంతో పెట్టుబడిదారులు బంగారంపై కాకుండా స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచంలోని ఇద్దరు అతిపెద్ద ఇంధన శక్తి గల దేశాలు చేతులు కలపడం వల్ల డాలర్ విశ్వసనీయత పెరిగి, విలువైన లోహాల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *