‘అభినవ్’ – డ్రగ్స్ మాఫియాపై బాలల ధైర్యసాహసం!

‘అభినవ్’ – డ్రగ్స్ మాఫియాపై బాలల ధైర్యసాహసం!

ప్రముఖ బాలల చిత్ర దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్ మరో సందేశాత్మక సినిమాతో ముందుకొచ్చారు. ఆయన రూపొందించిన “ఆదిత్య”, “విక్కీస్ డ్రీమ్”, “డాక్టర్ గౌతమ్” చిత్రాలు బాలల మనసులను ప్రభావితం చేసి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకున్నాయి. ఇప్పుడు, ఆయన దర్శకత్వంలో “అభినవ్” (Chased Padmavyuha) అనే కొత్త సినిమా వస్తోంది. సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ – డ్రగ్స్ మాఫియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సమాజాన్ని కలుషితం చేస్తోందని, ఈ మాఫియాను ఎదుర్కొనే సాహస బాలుడి కథే ‘అభినవ్’ అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం పెరిగిపోతుండగా, తన తాత నారాయణరావు స్ఫూర్తితో అభినవ్ అనే బాలుడు ఈ మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడో ఈ సినిమాలో చూపించబోతున్నారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలంటే ఎన్‌సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం వంటి శిక్షణలు తీసుకోవడం ఎంతో అవసరం అని, ఈ సినిమా ద్వారా పిల్లలకు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *