అపస్మారక స్థితిలో రోగి, ఆపరేషన్ థియేటర్లో నర్సుతో గొడవకు దిగిన డాక్టర్, సామాన్యుల ప్రాణాలకు భద్రత ఎక్కడ?
February 4, 2026

న్యూస్ డెస్క్ : ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే బాధ్యత మరచి ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఒక సర్జన్ అనస్థీషియా ఇచ్చిన రోగిని గాలికొదిలేసి, ఆపరేషన్ థియేటర్ లోనే నర్సుతో గొడవకు దిగిన ఘటన అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. రోగి ప్రాణం కంటే వ్యక్తిగత గొడవలే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరించిన ఈ డాక్టర్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
తన ప్రియురాలి కోసం తోటి నర్సుతో గొడవ పడ్డ ఈ సర్జన్ వ్యవహారాన్ని స్వయంగా అతని భార్యే బయటపెట్టింది. భర్త అక్రమ సంబంధాల గురించి ఆమె ఫిర్యాదు చేయడంతో సదరు డాక్టర్ ను ఆసుపత్రి నుంచి తొలగించారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం 19 మంది ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా ఆసుపత్రుల యాజమాన్యాలకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి.