చెత్త నుండి స్వచ్ఛమైన ఇంధనం గ్రీన్ ఎనర్జీలో భారత్ సంచలన విజయం
January 5, 2026

భారతదేశం హరిత ఇంధన రంగంలో భారీ పురోగతిని సాధించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 132 బయో గ్యాస్ (CBG) ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయని, వీటి ద్వారా రోజుకు 920 టన్నుల ఇంధనం ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ‘సతత్’ (SATAT) పథకం ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మారుస్తూ, అటు కాలుష్యాన్ని తగ్గిస్తూనే ఇటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది.
ఇంధన భద్రతను పెంచేందుకు 2025 డిసెంబర్ నాటికి చమురు, గ్యాస్ మరియు బొగ్గు ఆధారిత మిథేన్ అన్వేషణకు సంబంధించి 50 కొత్త బ్లాకులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. OALP మరియు DSF వేలం ద్వారా దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నూతన చట్ట సవరణల వల్ల ఈ రంగంలో వ్యాపార నిర్వహణ మరింత సులభతరం కావడంతో భారత్ ఇంధన స్వయంసమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.