அர்ஷ்தீப் సింగ్ రికార్డును బద్దలు కొట్టిన వరుణ్ చక్రవర్తి సరికొత్త చరిత్ర

దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డేవిడ్ మిల్లర్ వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 18 మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచాడు. గతంలో అర్ష్‌దీప్ సింగ్ వరుసగా 17 మ్యాచ్‌ల్లో వికెట్లు తీసి నెలకొల్పిన రికార్డును వరుణ్ ఇప్పుడు అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసినప్పటికీ, వరుణ్ తన నిలకడైన ప్రదర్శనతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. గత 18 మ్యాచ్‌ల్లో అతను మొత్తం 34 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కూడా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. భారత్ ఓటమి పాలైనప్పటికీ, వరుణ్ సాధించిన ఈ మైలురాయి క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.