నగ్నంగా ఉరితీసి, మృతదేహాన్ని దహనం చేసిన ఉన్మాద మూక! బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి ఇంత దారుణమా?
December 20, 2025

బంగ్లాదేశ్‌లోని మైమన్సింగ్లో మత దూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని గుంపుగా చేరి కిరాతకంగా కొట్టి చంపారు. మానవత్వం మరచిన ఆ మూక, యువకుడిని నగ్నంగా ఉరితీసి, అనంతరం మృతదేహాన్ని స్తంభానికి కట్టి నిప్పు పెట్టారు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. మరోవైపు, యాక్టివిస్ట్ ఉస్మాన్ హాదీ హత్య మరియు మీడియా సంస్థలపై దాడులతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి.