రామదాస్‌కు షాకిచ్చిన డీఎంకే మరియు విజయ్ ఇక ఏఐఏడీఎంకే కూటమే దిక్కా

రామదాస్‌కు షాకిచ్చిన డీఎంకే మరియు విజయ్ ఇక ఏఐఏడీఎంకే కూటమే దిక్కా

తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది అయితే పీఎంకే అధినేత డాక్టర్ రామదాస్ ప్రస్తుతం తీవ్ర రాజకీయ సందిగ్ధంలో పడ్డారు. అటు అధికార పార్టీ డీఎంకేలో చోటు దక్కకపోవడం ఇటు నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ పొత్తుకు నిరాకరించడంతో రామదాస్ ఒంటరి అయ్యారు. ముఖ్యంగా వీసీకే నేత తిరుమావళవన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికార కూటమి తలుపులు ఆయనకు పూర్తిగా మూసుకుపోయాయని వినికిడి.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి రామదాస్ మళ్లీ ఏఐఏడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తన కుమారుడు అన్బుమణి రామదాస్ ఇప్పటికే ఆ పార్టీతో సన్నిహితంగా ఉండటంతో ఎడప్పాడి పళనిస్వామి సారథ్యంలోని కూటమిలో చేరాలని ఆయన భావిస్తున్నారు. మాజీ మంత్రులు సీవీ షణ్ముగం మరియు కేపీ అన్బళగన్ మధ్యవర్తిత్వంతో పాత విభేదాలను పక్కన పెట్టి తిరిగి ఆకు నీడలోకి మామిడి పండు చేరుతుందో లేదో వేచి చూడాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *