దట్టమైన పొగమంచుతో విమానాల నిలిపివేత! ఎయిర్ ఇండియా, ఇండిగో కీలక అలర్ట్
December 20, 2025

ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, అమృత్సర్ వంటి ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గడంతో ఎయిర్ ఇండియా మరియు ఇండిగో సంస్థలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు తమ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని ఎయిర్లైన్స్ తెలిపాయి.
విమానాశ్రయానికి వెళ్లే ముందు ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించారు. ఎయిర్ ఇండియా ‘FogCare’ కింద ఉచితంగా ప్రయాణ సమయం మార్చుకునే లేదా పూర్తి రీఫండ్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. వాతావరణం అనుకూలించిన వెంటనే సేవలు సాధారణ స్థితికి వస్తాయని సంస్థలు పేర్కొన్నాయి.